'అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి'

BDK: అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని పలువురు గ్రామస్తులు మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కాకుండా స్థానిక నాయకులతో ఇండ్ల కేటాయింపు జరిగిందని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు కలగజేసుకొని నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు.