ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

CTR: పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం చెడుగుట్ల పల్లెకు చెందిన జయప్రకాష్(23), స్వాతి(18) అయ్యప్పస్వామి మాల దరించారు. మొక్కు తీర్చుకోవడానికి మంగళవారం ఉదయం బైకులో సదుంకు బయలుదేరారు. మార్గమధ్యంలోని జమ్మికుంట వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.