VIDEO: అన్నమయ్య జిల్లాలో వింత ఆచారం!
అన్నమయ్య జిల్లాలో మొరుసు కాపుల ప్రాచీన సంప్రదాయం అయిన కొద్దేవర బొట్లు ఉగాది, దీపావళి తరువాత ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వరి పంట కోత తర్వాత, దంచిన బియ్యం, పసుపు, బెల్లంతో ముద్ద చేసి, దేశం నలుమూలల నుంచి వచ్చిన మొరుసు కాపు మహిళలు ఉపవాసం చేసి, గ్రామ పొలిమేరల్లో బొట్టు పెట్టి ఇళ్లలోకి వెళ్తారు. అయితే ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.