ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ

MHBD: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 22వ వార్డులో అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆదివారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి పాల్గొని ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో డిఇ ఉపేందర్, వార్డు ఆఫీసర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.