'రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి'

RR: రైతుబీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని మొయినాబాద్ మండల వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు మాత్రమే అర్హులని, ఈ నెల 13వ తేదీలోపు మొయినాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.