గాయపడిన వారిని పరామర్షించిన కలెక్టర్

KRNL: శ్రీశైలం దర్శనానంతరం ఆదోనికి తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ప్రత్యేక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.