జిల్లా రైతులకు గుడ్ న్యూస్..!
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం బుధవారం 214 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 15 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.254 TMCల నీటిని విడుదల చేశారు.