విద్యార్థుల చొరవతో రక్త సేకరణ

విద్యార్థుల చొరవతో రక్త సేకరణ

SKLM: పి.ఎన్. కాలనీలోని న్యూ సెంట్రల్ స్కూల్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా రక్త దాతలు హాజరు కాగా, ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం 215 మంది రక్తదానం చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.