VIRAL: రోడ్లపై చెత్తవేసే వారికి షాక్
ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లి రోడ్లపై లేదా ఖాళీ స్థలంలో వేస్తున్నారా? అయితే, ఇక నుంచి అలా కుదరదు. అధికారులు రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించి, అదే చెత్తను వారి ఇంటి ముందే పోసి బుద్ధి చెబుతున్నారు. రూల్స్ ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా కూడా విధిస్తున్నారు. చెత్త వేసిన వారికి బెంగళూరు మున్సిపల్ షాక్ ఇచ్చిన ఘటన SMలో వైరల్ అవుతోంది.