ఊపందుకున్న మామిడి పండ్ల సీజన్
KKD: వేసవికాలం ప్రారంభమవడంతో మామిడి పండ్ల సీజన్ ఊపందుకుంది. తీపి రుచులతో మామిడి పండ్లు మార్కెట్లోకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. తుని నుంచి అన్నవరం వరకు జాతీయ రహదారి వెంట మామిడి పండ్ల దుకాణాలు వరుసగా కనిపిస్తున్నాయి. రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక స్టాల్స్ వద్ద వివిధ రకాల మామిడిపండ్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.