ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న జడ్పీ సీఈవో

KMM: ఖమ్మం జెడ్పీ సీఈవో దీక్షారైనా ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించినందుకు ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు.