'ఆలయ అభివృద్ధికి కొత్త కమిటీ తగిన కృషి చేయాలి'

కృష్ణా: ఆలయ అభివృద్ధికి కొత్త కమిటీ తగిన కృషి చేయాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. మంగళవారం విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బొండా ఉమా ముఖ్య అతిధిగా విచ్చేసి ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.