రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సిద్దిపేట- ఎల్కతుర్తి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.