విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎండీ గౌస్

మెదక్: చిన్నశంకరంపేట మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎండీ గౌస్ ఎన్నికయ్యారు. ఆదివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ప్రతాప్, విజయరాణి, ప్రధాన కార్యదర్శిగా విశ్వనాధం, సహాయ కార్యదర్శిగా యాదగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పుష్పవేణి, ప్రచార కార్యదర్శిగా శ్రీరాములు ఎన్నికయ్యారు.