బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. మాజీ మంత్రి
MHBD: డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన అప్సర్ ఖాన్ మాతృమూర్తి యాకుబి ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం సాయంత్రం మృతురాలు నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.