అంతర్జాతీయ పోటీల్లో 'దివ్యాన్షిత'కు వెండి పతకం
MDK: మనూరు మండలం డవ్వూరుకు చెందిన దివ్యాన్షిత అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. ఏప్రిల్ 16-18 వరకు మలేషియాలో జరిగిన 'సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే కప్ (2026)'లో ఆమె వెండి పతకం సాధించింది. దీంతో పాటు స్కాట్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు కూడా అర్హత సాధించిందని కోచ్ నవీన్ కుమార్ తెలిపారు. దివ్యాన్షితను హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ప్రత్యేకంగా అభినందించారు.