'నరసాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'నరసాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

W.G: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను నేరుగా కలసి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్సలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులు, నర్సులు సహా ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి, పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు.