మాదకద్రవ్యాలకు బలవుతున్న విద్యార్థులు

మాదకద్రవ్యాలకు బలవుతున్న విద్యార్థులు

TPT: సూళ్లూరుపేటలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు పెరుగుతున్నాయని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్.లోకేశ్ మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లోనే మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయి. విద్యార్థులు మాదకద్రవ్యాల బానిసలవుతున్నారని తెలిపారు.