రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ : హరీశ్ రావు

SDPT: కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆరోగ్య శ్రీ బిల్లులు, ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు ఆపేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. డ్రామాలు కట్టిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.