ఇరాన్‌పై B-2 బాంబర్లతో అమెరికా దాడి
ఇరాన్‌పై B-2 బాంబర్లతో అమెరికా విరుచుకుపడింది. బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. అలాగే ఆ దేశ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేయడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. మరో వైపు బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో భారీ దాడి చేయడంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది.