నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: మొంథా తుఫాన్ ప్రభావంతో నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి, కొండాలమ్మ గుడి, వీవర్స్ కాలనీవాసులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో సోమవారం ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.