జనసేన ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
VSP: జనసేన ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటన యలమంచిలి మండలం జంపపాలెంలో చోటుచేసుకుంది. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన యల్లపు సతీష్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరయ్యారు. గతంలో తాము ఎన్నిసార్లు పిలిచినా ఎమ్మెల్యే రాలేదని.. ఇప్పుడు ఎలా వస్తున్నాడని గ్రామస్తులు నిలదీశారు. దీంతో చేసేది ఏం లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగాడు.