'ఉపాధి హామీ అధికారులు పారదర్శకంగా పనిచేయాలి'
SRPT: ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అధికారులు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా అడిషనల్ పీడీ శిరీష అన్నారు. శనివారం నాగారంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు.