సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి గుట్టకు కొత్త ఛైర్మన్
JN: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట నూతన ఛైర్మన్‌గా బమ్మెర గ్రామ వాస్తవ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ శనివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని రాపాక సత్యనారాయణ తెలిపారు.