గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

TG: సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద పటాన్‌చెరు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ క్రమంలో విశాల్, అనిల్, మణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.