ఖతార్‌కు గట్టి దెబ్బ.. కోలుకునేందుకు ఐదేళ్లు!
ఇరాన్ దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు ఖతార్ వెల్లడించింది. తమ సంస్థ LNG ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని తెలిపింది. వాటి మరమ్మతులకు మూడు నుంచి ఐదేళ్లు పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో LNG సరఫరాలకు సంబంధించి ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పింది.