VIDEO: భయభ్రాంతులకు గురి చేసిన రక్తపింజర

VIDEO: భయభ్రాంతులకు గురి చేసిన రక్తపింజర

NRML: నిర్మల్ పట్టణంలోని రవి నగర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము ఆదివారం ప్రత్యక్షమైంది. చెట్లకు నీళ్లు పోస్తున్న క్రమంలో ఇంటి యజమాని రక్త పింజర పామును చూసి భయభ్రాంతులకు గురి అయ్యాడు. దీంతో వెంటనే శాంతినగర్ కాలనీలోని స్నేక్ క్యాచర్ అనిల్‌కి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఆయన పామును అత్యంత చాకచక్యంగా పట్టుకొన్నారు.