VIDEO: అర్ధగిరి పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచారం

VIDEO: అర్ధగిరి పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచారం

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో పులి సంచరిస్తూ కనిపించింది. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో సుధాకర్ తెలిపారు.