నేడు జిల్లాకు సీఎం రాక
WGL: నేడు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాకు చేరుకుని మొంథా తుఫాను ప్రభావంతో నగరంలో నీట మునిగిన వివేకా నగర్, సమ్మయ్య నగర్, ప్రగతి నగర్‌లను పరిశీలిస్తారు. నిన్న ఉదయమే పర్యటించాల్సి ఉన్న పలు కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు.