'ఆర్డీటీ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధం'
సత్యసాయి: ఆర్డీటీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ కన్వీనర్ సాకే హరి తెలిపారు. ఆదివారం బత్తలపల్లి కేంద్రంలోని ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ ఘాట్‌ను సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల గుండెల్లో ఆర్డీటీ శాశ్వతంగా నిలిచిపోయిందని కొనియాడారు.