నేడు మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం
W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో మెప్మా భవనంలో ఇవాళ ఉదయం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ మేనేజర్ కే.సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయం సహాయక సంఘం సభ్యులకు బీపీ, షుగర్, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలకు పరీక్షలు చేసి మందులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.