VIDEO: ప్రమాదపు అంచున పోచారం ప్రాజెక్టు

VIDEO: ప్రమాదపు అంచున పోచారం ప్రాజెక్టు

KMR: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో పోచారం ప్రాజెక్టు అలుగు పక్కన గండి ఏర్పడింది. దీంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడింది. వరద ఉధృతి మరింత పెరిగితే ఏ క్షణమైనా కట్ట తెగే పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గండిని పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు.