ఇంటి నుంచే ఫిర్యాదులు సమర్పించవచ్చు: కలెక్టర్

ఇంటి నుంచే ఫిర్యాదులు సమర్పించవచ్చు: కలెక్టర్

ELR: ప్రజా ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోంది. దీనిలో భాగంగా, జిల్లాలో PGRS (Public Grievance Redressal System) వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటి వద్ద నుంచే ప్రజలు వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.