RTC కార్మికుల సమ్మె.. ఇబ్బందులో ప్రయాణికులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. 125 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇవాళ కార్మికులు డిపో వద్ద ధర్నా చేస్తుండగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వెంటనే చర్యలు తీసుకొవాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.