విద్యార్థుల అస్వస్థతపై విచారణకు ఆదేశం: కలెక్టర్
GDL: జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురికావడంతో వారికి చికిత్స అందించినట్లు కలెక్టర్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం టిఫిన్ చేశాక పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఎండ తీవ్రత కారణంగానే కొద్దిగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులతో విచారణ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తారని తెలిపారు.