చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే
KRNL: ఆదోని మండలం నాగలాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురై ప్రభుత్వ సర్వజన ఆసుత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంగళవారం పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్యులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల పరిస్థితిని అంగన్వాడీ గ్రామీణ సీడీపీవో మల్లీశ్వరి, ఎమ్మెల్యేకు వివరించారు.