సుబ్బారాయునిపల్లెలో తాగునీటి కోసం నిరసన
సత్యసాయి: నల్లమాడ మండలం సుబ్బారాయునిపల్లె ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం కాలనీవాసులు రోడ్డెక్కారు. దాదాపు నెల రోజులుగా నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పంచాయతీ సెక్రటరీ జనార్దన్ రెడ్డి త్వరలోనే తాగునీటి సమస్య గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వివరణ ఇచ్చారు.