మాదలంగి సమీపంలో ఏనుగుల గుంపు
PPM: కొమరాడ మండలం మాదలంగి, చెక్కవలస గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కురుపాం నుంచి మాదలంగి రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని కోరారు.