మరో బస్సు ప్రమాదం.. 10 మంది మృతి

మరో బస్సు ప్రమాదం.. 10 మంది మృతి

మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని బస్సు వేగంగా ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.