అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

PPM: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగు సూచనలు జారీ చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తత ఉండాలని ఆయన పేర్కొన్నారు.