40 కుటుంబాలు జనసేనలోకి చేరిక

40 కుటుంబాలు జనసేనలోకి చేరిక

విజయనగరం: 11వ డివిజన్ కాటవీధికి చెందిన 40 కుటుంబాలు ఆదివారం జనసేన పార్టీలో చేరాయి. స్థానిక నాయకులు లోపింటి వెంకట ప్రసాద్ నేతృత్వంలో వీరంతా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆ పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ భవిష్యత్‌లో తిరుగు లేని శక్తిగా ఎదుగుతోంది అన్నారు.