'రైల్వే పాసులు పునరుద్ధరించాలి'
MBNR: జర్నలిస్టుల సబ్సిడీ రైల్వే పాసులు పునరుద్ధరించాలని TUWJ (IJU) గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ రెడ్డి, రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం గద్వాల బీజేపీ ఆఫీసులో పాలమూరు ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరోనా సమయం నుంచి నిలిచిన జర్నలిస్టుల రైల్వే సబ్సిడీ పాసుల గురించి రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లి పునరుద్ధరించాలని కోరారు.