213 అంశాలకు స్థాయి సంఘం ఆమోదం
VSP: విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 217 అంశాలు పొందుపరచగా, 213 అంశాలకు ఆమోదం తెలిపారు.