తాడ్వాయిలో మొదటి విడత నామినేషన్లు పూర్తి
MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. 18 సర్పంచ్ స్థానాలకు 119 మంది అభ్యర్థులు, 152 వార్డు సభ్య స్థానాలకు 312 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రికార్డు స్థాయిలో నామినేషన్లు పడటంతో ఎన్నికల పోటీ ఉధృతంగా సాగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు.