డోకిపర్రులో 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

డోకిపర్రులో 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

GNTR: మేడికొండూరు మండలం డోకిపర్రులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద గాయత్రీ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు జానపద గీతాలు, డప్పు వాయిద్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, దోమల నిర్మూలనపై వారు అవగాహన కల్పించారు.