ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

కాకినాడ రూరల్ రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. నేలను ఆనుకుని ఉండటంతో పాటు వైర్లు వేలాడుతుండటంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలు మూగజీవాలు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.