VIDEO: అర్ధరాత్రి మట్టి తవ్వకాలు..!
NTR: మైలవరం మండలంలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. చంద్రాలలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వారు వీడియో తీసి SMలో పెట్టారు. ZPHS సమీపంలోని నల్లచెరువు నుంచి మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ వీడియోను విడుదల చేశారు. అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.