అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

MNCL: నస్పూర్ పరిధి తోళ్లవాగు సమీపంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 19 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.