23న రేపల్లెలో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్
BPT: ప్రతి సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్ఎస్‌ను ఈ నెల 23న రేపల్లెలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రేపల్లె డివిజన్ కేంద్రంలోని పత్తిపాటి సీతారామయ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు వినతి పత్రాల ద్వారా తెలియజేయవచ్చని ఆయన సూచించారు.