ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

W.G: పోడూరు మండలం జగన్నాధపురం శివారులో గురువారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇటుకల లోడుతో నరసాపురం నుంచి పెనుగొండ వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కాలువ వైపునకు తిరగబడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా బోల్తా పడటంతో లోడుపై కూర్చున్న ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి.